Site icon Bhakthi TV

కేదార్‌నాథ్ యాత్రలో విషాదం.. ఇద్దరి మృతి.. ముగ్గురికి గాయాలు

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ యాత్రకు భక్తులంతా పయనమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లిన కొందరు ప్రమాదంలో చిక్కుకున్నారు. గౌరికుండ్-రాంబాడ మధ్య ఉన్న జంగిల్ చట్టిలోని స్తంభం నంబర్ 153 సమీపంలోని కొండ వద్ద ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి కొండపై నుంచి ప్రమాదవశాత్తు కొందరు లోయలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఒక వ్యక్తి కూడా తప్పిపోయినట్టుగా తెలుస్తోంది.

తప్పిపోయిన వ్యక్తి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే డీడీఆర్ఎఫ్‌ను సహాయక చర్యల కోసం ఉన్నతాధికారులు పంపించారు. కాగా.. మరణించిన వారి వివరాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఒక వ్యక్తి గాయపడగా.. అతడిని కంది ద్వారా గౌరీకుండ్‌కు చికిత్స నిమిత్తం అధికారులు తరలించారు. ఈ నెల 15వ దేతదీ కూడా ఇలాంటి ప్రమాదమే ఒకటి జరిగింది. ఆ సమయంలో భారీ వర్షం కారణంగా అకస్మాత్తుగా కాలువలోకి శిథిలాలు వచ్చి పడ్డాయి. దీంతో ఒక యాత్రికుడు మరణించగా.. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. రెండు రోజుల పాటు నడక ప్రయాణాన్ని ఆపేసి రోడ్డు క్లియర్ చేయడంతో యాత్రను తిరిగి ప్రారంభించారు. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.

Share this post with your friends
Exit mobile version