Site icon Bhakthi TV

నేడు తులరాశిలోకి సూర్యుడు.. బుధాదిత్య రాజయోగం..

నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రయాణిస్తాడు. ఈ క్రమంలోనే శుక్రవారం (అక్టోబర్ 17)న సూర్యుడు కన్యారాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సూర్య సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి జీవితంలో విశేష మార్పులు రానున్నాయట. సూర్యుడి రాశి మార్పుతో ఏయే రాశుల వారికి మంచి జరగనుందో తెలుసుకుందాం. శుక్రవారం మధ్యాహ్నం 1:53 గంటలకు సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రాశిలో సూర్యుడు నవంబర్ 15 వరకూ ఉండనున్నారు. ఇప్పటికే తులారాశిలో సంచరిస్తున్న బుధుడితో సూర్యుడు కలవనున్నాడు.

బుధుడు, సూర్యుడి కలయిక కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఆర్థిక పరమైన ప్రయోజనాలతో పాటు వ్యాపారులకు బాగా కలిసి రానుంది. మేషరాశి, మిథునరాశి, సింహరాశివారికి మంచి జరుగనుంది. సూర్యుని తులా సంక్రమణం మేషరాశిలో ఏడవ స్థానంలో జరుగనుంది. ఇది వారసత్వపు ఆస్తులకు, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించినది కాబట్టి తులారాశిలో సూర్యుడు సంచారం చేస్తున్న సమయంలో మేష రాశి వారికి పూర్వీకుల ఆస్తులతో పాటు ఉద్యోగ వ్యాపారాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు, కొత్త అవకాశాలు అందుకుంటారట. ఇక మిథునరాశిలో సూర్యుని తులా సంక్రమణం ఐదవ స్థానంలో జరగనుంది. ఇది ఆర్థిక వ్యవహారాలకు సంబంధించింది. ఈ రాశివారికి వృత్తిలో అధిక ఆదాయం, ఆకస్మిక ధనలాభం వంటివి ఉంటాయి. ఇక సింహరాశివారికి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు, తలపెట్టిన పనుల్లో విజయం చేకూరుతుంది.

Share this post with your friends
Exit mobile version