
ఇవాళ శ్రావణమాసం తొలి శుక్రవారం. లక్ష్మీదేవికి ఈ రోజు ఎంతో ప్రీతికరమైనది. కొందరు మహిళలు ఈ రోజునే వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. తొలి శుక్రవారం కావడంతో ఆలయాలన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి. ఈ రోజున ఇళ్లతో పాటు ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ మాసం శివకేశవులకు చాలా ఇష్టమైనది కాబట్టి.. శివాలయాలన్నీ ప్రత్యేక కళను సంతరించుకున్నాయి. ఈ శ్రావణ మాసం ఆగస్ట్ 23 వరకూ ఉండనుంది. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతంతో పాటు మంగళగౌరి వ్రతం చేస్తారు కాబట్టి ఈ మాసంలో మంగళవారం, శుక్రవారం, పండుగలు ఎప్పుడున్నాయో తెలుసుకుందాం.
మంగళవారాలు
మొదటివారం: 29.07.25
రెండవ వారం: 05.08.25
మూడవ వారం: 12.08.25
నాల్గవ వారం: 19.08.25
శ్రావణ శుక్రవారాలు
మొదటివారం: 25.07.25
రెండవ వారం: 01.08.25
మూడవ వారం: 08.08.25
నాలుగవ వారం: 15.08.25
ఐదవ వారం: 22.08.25
పండుగలు…
జూలై 29: నాగుల పంచమి
ఆగస్ట్ 08: వరలక్ష్మి వ్రతం
ఆగస్టు 09: రాఖీ పండుగ
ఆగస్ట్ 15: కృష్ణాష్టమి.
ఆగస్టు 22: పోలాల అమావాస్య
