Site icon Bhakthi TV

ఇవాళ హరికథా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాస జయంతి

హరికథా పితామహునిగా వినుతికెక్కిన శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాస 160వ జయంతిని ఆగష్టు 31వ తేదీ తిరుపతి మహతి కళాక్షేత్రంలో వైభవంగా నిర్వ‌హించేందుకు టీటీడీ హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ఉదయం 8.30 గంట‌ల‌కు ఎస్వీ సంగీత కళాశాల ప్రాంగణంలోని శ్రీ ఆదిభట్ట నారాయణదాసు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, బృందగానం నిర్వహిస్తారు. అనంత‌రం మ‌హ‌తి కళాక్షేత్రంలో ఉద‌యం 9 గంట‌ల నుండి హ‌రిక‌థ ప్రాశ‌స్త్య‌ము, హ‌రిక‌థ – ధ‌ర్మ ప్ర‌చారం, శ్రీ ఆదిభట్ల నారాయణదాసు జీవిత విశేషాలు, ప్ర‌ముఖ కళాకారులతో హరికథాగానం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

1 నుంచి ”హ‌రిక‌థ వైభ‌వం”

సెప్టెంబ‌రు 1 నుండి 10వ తేదీ వ‌ర‌కు హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వర్యంలో హ‌రిక‌థ క‌ళాకారులకు ” హ‌రిక‌థ వైభ‌వం “ పేరిట శిక్ష‌ణ కార్య‌క్ర‌మం జరుగనుంది. ఈ కార్యక్రమం వారి నైపుణ్యాలను మెరుగు పరచుకునేందుకు ఉపయోగపడనుంది. ఎంపిక చేసిన 180 మంది హరికథకులకు తిరుప‌తి శ్వేత భ‌వనంలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు.

Share this post with your friends
Exit mobile version