Site icon Bhakthi TV

నేడు పౌర్ణమి.. ఇవాళ సాయంత్రం ఏం చేయాలంటే..

ఇవాళ పౌర్ణమి. ఆశ్వయుజ మాసంలో వచ్చే పౌర్ణమిని శరత్ పౌర్ణమి, శారద పౌర్ణమి, కౌముది పున్నమి అని కూడా పిలుస్తారు. నేడు రాత్రి పౌర్ణమి ఘడియలు ఉన్నాయి కాబట్టి అమ్మవారి భక్తులు వెన్నెల పారాయణ చేయవచ్చు. పౌర్ణమి ఘడియల్లో వెన్నెలలో పారాయణం చేస్తే అమ్మవారి విశేష అనుగ్రహం ప్రసాదమవుతుంది. ఇది అత్యంత శీఘ్రముగా అభీష్టసిద్ధి కలిగించే సాధనగా పరంపరగా తెలియజేయబడింది. పౌర్ణమి రాత్రి వెన్నెలలో, శ్రద్ధ–భక్తులతో లలితా సహస్రనామం లేదా దేవి ఖడ్గమాల పారాయణం చేయడం వలన ఘోరమైన సమస్యలూ శాంతిస్తాయి, సంకల్పాలు త్వరగా సిద్ధిస్తాయి. “ఇది సత్యము, ఇది సత్యము, ఇది సత్యము”.. ఈ విశ్వాసంతో చేయవలసిన సాధన ఇది.

కాచిన పాలల్లో ఏలకులు, పటికబెల్లం కలపాలి. ప్రశాంతమైన స్థలం (బయట వెన్నెలలో కూర్చోవచ్చు; సాధ్యం కాకపోతే ఇంట్లో చంద్రుని పాలల్లో దర్శించి పూజా మంటపంలో ఉంచాలి). చంద్రోదయం తర్వాత సతి–నిశ్చల ఆసనంలో కూర్చోండి. ముందు మనస్సు స్థిరంగా ఉండేలా మృదు శ్వాస–ప్రశ్వాసలతో కొద్దిసేపు ధ్యానం చేయండి. అమ్మవారిని ఆత్మీయంగా ధ్యానిస్తూ, దేవి ఖడ్గమాల లేదా లలిత సహస్రం 9 సార్లు పారాయణం చేయండి. 9 సార్లు చేయలేని వారు మీ శక్తి కొలది ఈ పారాయణ లేదా స్తోత్రం మనః పూర్వకంగా వినండి తరువాత ఆ పాలను అమ్మకి నివేదించి .. మీ కుటుంబ సభ్యులందరికీ తీర్థంలా ఇవ్వండి. వెన్నెల పారాయణ వలన అమ్మవారి సంపూర్ణ కృప కలిగి మీ ఇల్లు, కుటుంబం అమ్మవారి దయవలన సంపూర్ణ ఆయురారోగ్య సంపదలతో వృద్ధి పొందుతుంది.

Share this post with your friends
Exit mobile version