తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 25న రథసప్తమి సందర్భంగా భక్తుల భారీ రద్దీ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రథసప్తమి సందర్భంగా సమీక్షను నిర్వహించి భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, వైద్య సేవలు, అన్నప్రసాదం, శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లపై నిర్ణయాలు తీసుకున్నారు. రథసప్తమి రోజున సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహన సేవలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంతో పాటు ఎన్ఆర్ఐ, సీనియర్ సిటిజన్, వికలాంగుల దర్శనాలు రద్దు చేశారు. జనవరి 24 నుంచి 26 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చెయ్యరు. ప్రోటోకాల్ మినహా విఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేశారు.

