
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంతటి విశిష్టత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రసాదాలన్నింటిలోకి కింగ్.. ప్రపంచంలోనే నంబర్ 1 ప్రసాదం అని చెప్పాలి. అలాంటి తిరుమల లడ్డూకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారా? అదెప్పుడో కాదు.. నిన్ననే. తిరుమల శ్రీవారి లడ్డూని మొట్ట మొదటసారిగా ఆగస్ట్ 2 వ తేదీ 1715 సంవత్సరంలో తిరుమల శ్రీవారికి నివేదించారు. ప్రస్తుత దిట్టంతో నివేదించిన లడ్డూకు నిన్నటితో 310 ఏళ్లు. 2010 వరకూ దాదాపు రోజుకు లక్షల లడ్డూలను టీటీడీ తయారు చేసేది.. భక్తుల అధిక రద్దీ కారణంగా లడ్డూ తయారీని పెంచేశారు. ప్రస్తుతం టీటీడీ నిత్యం దాదాపు మూడు లక్షల ఇరవై వేల లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది.
15 శతాబ్దంలో స్వామివారి భక్తులకి లడ్డూ ప్రసాదం ఇచ్చేవారు కాదు.. వడ ప్రసాదాన్ని మాత్రమే అర్చకులు నైవేద్యంగా సమర్పించేవారు. ఆ తర్వాత17 వ శతాబ్దం నుంచి బుంది లడ్డూను అందించడం ప్రారంభించారు. అప్పట్లో లడ్డూలను హథీరాంజీ మఠం వారు తయారు చేసేవారు. తొలిసారిగా లడ్డూ ప్రసాదం.
1715 ఆగస్టు 2న తయారైందట. ఆ తరువాత క్రీ.శ.1803లో బూందీ తయారు చేసేవారు. ఆ తరువాత 1940 నుంచి లడ్డూ ప్రసాదంగా స్థిరపడిందని కొందరు చెబుతారు. అప్పట్లో కేవలం ఎనిమిది నాణేలకే లడ్డూ ఇచ్చేవారట. ఆ తరువాత నుంచి క్రమక్రమంగా ధర పెరుగుతూ.. ప్రస్తుతం రూ.50 చేరింది. తిరుపతి లడ్డూకి పపేటెంట్, ట్రేడ్ మార్క్ సైతం ఉండటం విశేషం.
