Site icon Bhakthi TV

మంగళకరంగా ప్రారంభం కానున్న సిరిమానోత్సవం.. షెడ్యూల్ ఏంటంటే..

సాధారణంగా దసరా పండుగ తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. కొన్నేళ్లుగా ఇదే పద్ధతిని అనుసరించడం జరుగుతోంది. ఈ ఏడాది కూడా అలాగే జరుగనుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది అక్టోబర్ 7వ తేదీ కూడా పైడితల్లి సిరిమానోత్సవం జరుగనుంది. ఇప్పటికే సిరిమానోత్సవం అయితే ఇప్పటికే ప్రారంభమైంది. అయితే సిరిమానోత్సవం షెడ్యూల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సెప్టెంబరు 12 , చదురు, వనంగుడి వద్ద పందిరిరాటతో సిరిమానోత్సవం ప్రారంభమై.. ఇక్కడ నుంచి అక్టోబరు 22 వరకు మండల దీక్షలు ఉంటాయి.

అక్టోబర్‌ 6న అంటే ఇవాళ తోలేళ్ల ఉత్సవం, అక్టోబర్ 7న మంగళవారం అమ్మవారి సిరిమానోత్సవం.. అక్టోబరు 14 మంగళవారం తెప్పోత్సవం, ఉయ్యాల కంబోత్సవం.. చివరి రోజు వనంగుడిలో చండీహోమం, పూర్ణాహుతితో దీక్షలు ముగుస్తాయి. ఇక ఇవాళ తోలేళ్ల ఉత్సవం సందర్భంగా రైతులు అమ్మవారి అనుగ్రహంతో తొలుత నాగలితో పొలాన్ని దున్నుతారు. అయితే ఈ ఉత్సవాన్ని అప్పట్లో ‘తొలి’ ‘ఏరు’ అని అనేవారు. అదే కాలక్రమేణా తోలేళ్ల ఉత్సవంగా మారింది. తోలేళ్ల ఉత్సవం సందర్భంగా ఈ రోజు రాత్రి చదురు గుడి నుంచి అమ్మవారి ఘటాలను విజయనగరం కోటలోకి తీసుకెళ్లి అక్కడ కోటకు పూజ చేస్తారు. బస్తాలలో విత్తనాలను అమ్మవారి ముందు పెట్టి ఆశీర్వాదం పొందుతారు. అనంతరం ఆ విత్తనాలను పూజారి రైతులకు అందిస్తాడు. వీటిని పొలంలో చల్లుతారు. ఈ ఉత్సవంలో అమ్మవారి ముందుంచిన విత్తనాలను పొలంలో చల్లితే పంటలు సమృద్ధిగా కొనసాగుతాయి.

Share this post with your friends
Exit mobile version