Site icon Bhakthi TV

కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లేవారు తెలుసుకోవాల్సిన విషయాలేంటంటే..

ఛార్‌దామ్ యాత్రకు పెద్ద ఎత్తున భక్తులు వెళ్లుతున్నారు. ఈ క్రమంలోనే కేదార్‌నాథ్ దామ్ యాత్రకు కూడా సన్నద్ధమవుతున్నారు. అయితే కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లేవారు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ మీతో తీసుకెళ్లకూడదు. అవి ఎందుకు తీసుకెళ్లకూడదు? అసలు అవేంటో తెలుసుకుందాం. ఇదొక ఆధ్యాత్మిక యాత్ర కాబట్టి ఎవరూ పొరపాటున కూడా మాంసాహారం తీసుకెల్లరు తీసుకెళ్లకూడదు కూడా. వీటిపై నిషేధం ఉంది. మద్యం సేవించి కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లకూడదు. మద్యం, మాదక ద్రవ్యాలతో పట్టుబడితే చర్యలు చాలా కఠినంగా ఉంటాయని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్లాస్టిక్, పాలిథిన్ నిషేధం. కేదార్‌నాథ్ ఆలయం ప్రకృతి సౌందర్యానికి నిలయం కాబట్టి అక్కడి వాతావరణాన్ని కలుషితం చేసే ఏ వస్తువులను అనుమతించరు. అలాగే కేదార్‌నాథ్ ఆలయానికి సమీపంలో మందాకిని నది, వాసుకి సరస్సు, చోర్బారి సరస్సు, గౌరీకుండ్ ఉన్నాయి. వీటిన్నింటి అందాలను కాపాడుకునేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్లాస్టిక్, పాలిథిన్‌పై నిషఏధం విధించింది. అలాగే ఇక్కడ డ్రోన్స్ నిషిద్ధం. ఒకవేళ డ్రోన్ తీసుకెళ్లాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి. ఇక వీటిలో ఏవి తీసుకెళ్లినా కూడా యాత్రకు అనుమతి లభించదు. కేదార్‌నాథుడిని దర్శించుకోకుండానే వెనుదిరగాల్సి ఉంటుంది.

Share this post with your friends
Exit mobile version