Site icon Bhakthi TV

సీతారాములకు పట్టువస్త్రాలు.. వాటి స్పెషాలిటీ ఏంటంటే..

శ్రీరామనవమి పండుగకు సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. సీతారాముల కల్యాణాన్ని ప్రతి హిందువూ తమ ఇంట జరిగే కల్యాణంగానే భావిస్తారు. ఈ క్రమంలోనే తమ చేతనైన మేరకు సినిమా కోసం సాయం అందిస్తారు. ప్రసాదాలు తయారు చేసి అందించడమో.. గోటితో తలంబ్రాలు వలిచి ఇవ్వడం.. ఇంకా ఎన్నో సాయాలు చేస్తారు. కులమతాలకు అతీతంగా స్వామివారి కల్యాణానికి హాజరవుతారు. ఈసారి భద్రాద్రి రామయ్య కోసం చీరాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం గోటి తలంబ్రాలను అందించడం జరిగింది.

ఇక భద్రాద్రి రామయ్య కోసం ఓ చేనేత కార్మికుడు పట్టు వస్త్రాలను నేసి ఇచ్చాడు. పట్టు వస్త్రాలు నేయమేముంది? అంటే అందులోనే ఉంది స్పెషలిటీ. సాదాసీదాగా ఆ బట్టలను నేసి అందించలేదు. శ్రీ రామనవమి సందర్భంగా పట్టు వస్త్రాలను సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు అందించాడు. పది రోజుల పాటు శ్రమించి పట్టుచీరపై భద్రాద్రి ఆలయ మూలవిరాట్‌ను కార్మికుడు నేశాడు. చీరపై ‘శ్రీరామ రామ రామేతి..’ శ్లోకాన్ని 51 సార్లు వచ్చేలా సదరు కార్మికుడు నేయడం విశేషం. ఒక గ్రాము గోల్డ్ జరీ పట్టుతో నేసిన ఈ ఏడు గజాల చీర బరువు 800 గ్రాములు కావడం మరో విశేషం.

Share this post with your friends
Exit mobile version