Site icon Bhakthi TV

హంస వాహనంపై విహరించిన ఉపమాక శ్రీ వేంకటేశ్వర స్వామి

అన‌కాప‌ల్లి జిల్లా ఉపమాకలోని శ్రీ వేంకటేశ్వరాలయంలో ఏకాదశి కల్యాణాలు అత్యంత వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. సోమ‌వారం ఉద‌యం ధ్వ‌జారోహణంతో ఏకాదశి కల్యాణాలు మార్చి 17వ తేదీ వరకూ కన్నుల పండువగా జరుగనున్నాయి. ఏకాదశి కల్యాణోత్సవాల్లో భాగంగా ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారికి, శ్రీ సుద‌ర్శ‌న పెరుమాళ్‌కు పల్లకీ ఉత్సవం ఘనంగా జరిగింది. అనంతరం కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. త‌రువాత మార్చి 11వ తేదీ మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 12.30 (సోమ‌వారం అర్థ‌రాత్రి) నుంచి ఉద‌యం 3.30 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల‌కు కల్యాణోత్సవం వైభ‌వంగా నిర్వహించారు.

కల్యాణ తంతు మొత్తం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అర్చకులు, వేద పండితులు శాస్త్రోకత్ంగా నిర్వహించారు. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన ఉప‌మ‌క ప‌రిస‌ర ప్రాంతాల‌ భక్తులు భక్తి పరవశంతో పులకించారు. కాగా మంగ‌ళ‌వారం రాత్రి 7.40 నుంచి 9.30 గంట‌ల వ‌ర‌కూ స్వామివారు హంస‌వాహ‌నంపై ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చారు. ఇవాళ రాత్రి 9 నుంచి 10 గంటల వరకు శ్రీ భూ సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారు పుణ్యకోటి వాహనంపై భక్తులను క‌టాక్షించ‌నున్నారు.

Share this post with your friends
Exit mobile version