Site icon Bhakthi TV

వైభవంగా కొనసాగుతున్న లింగమంతుల జాతర

తెలంగాణలో గొల్ల(పెద్ద) గట్టు జాతరగా ప్రసిద్ధికెక్కిన లింగమంతుల స్వామి జాతర ప్రారంభమైంది. దీనిని పెద్దగట్టు, గొల్లగట్టు జాతరగా కూడా పిలుస్తుంటారు. ఇది తెలంగాణలో రెండవ అతి పెద్ద జాతరగా నిర్వహించుకుంటూ ఉంటాం. రాష్ట్రంలో మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర తరువాత రెండవ అతిపెద్ద జాతరగా దీనికి పేరుంది. యాదవులంతా తమ ఆరాధ్య దైవంగా లింగమంతుల స్వామిని కొలుచుకుంటారు. రెండేళ్లకోమారు జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఆదివారం అర్థరాత్రి కేసరం నుంచి పెద్దగట్టు దేవరపెట్టే రాకతో జాతర మొదలైంది. ఈ జాతర ఐదు రోజుల పాటు జరుగనుంది. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారు.

భక్తులు కొందరు తమ మొక్కులు చెల్లించుకోవాలనుకునేవారు గజ్జెల లాగులు ధరించి, కత్తులు, కటర్లు, డప్పు వాయిద్యాలతో గుట్ట పైకి చేరుకుంటారు. సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లిలో జరిగే పెద్దగట్టు జాతర సందర్భంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పోలీసులు ఆంక్షలు విధించారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దురాజ్‌పల్లి పెద్ద గుట్టపై ఈ లింగమంతుల జాతర జరుగుతుంది. దీనినే జరిగే లింగమంతుల స్వామి జాతర. 300 ఏళ్ల ఘనమైన చరిత్ర కలిగిన ఈ జాతరను మేడారం జాతర మాదిరిగానే ప్రతి రెండేళ్ల కోసారి నిర్వహిస్తారు. ఈ జాతర ఆసియాలో రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి గాంచింది.

Share this post with your friends
Exit mobile version