
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తజన సందోహం నడుమ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఉదయం, సాయంత్రం స్వామివారికి వాహన సేవలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. వాహన సేవలో భాగంగా గురువారం ఉదయం సింహ వాహనసేవలో చండ మేళం, కోలాటాల కళాప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
కర్ణాటక రాష్ట్రం ఉడిపికి చెందిన శ్రీ అనిల్ బృందం చండమేళం(కేరళ డ్రమ్స్) వాయిస్తున్నారు. కేరళ డ్రమ్స్ బృందంలో మొత్తం 9 మంది కళాకారులు ఉన్నారు. వీరు డ్రమ్స్, తాళాలు లయబద్ధంగా వాయిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేస్తారు. వీరు డ్రమ్స్, తాళాలు లయబద్ధంగా వాయిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేస్తారు. అదేవిధంగా, నల్గొండకు చెందిన కనక దుర్గ కోలాట భజన బృందంలోని 25 మంది, తిరుపతికి చెందిన శ్రీ వల్లభ కోలాట భజన బృందంలోని 20 మంది చిన్నారులు, పాకాల, నారావారిపల్లి, కాకినాడకు చెందిన కళా బృందాలు కోలాటం నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
