Site icon Bhakthi TV

వైభవంగా ఒంటిమిట్ట శ్రీసీతారాముల కళ్యాణోత్సవం

తిరుమల తిరుపతి దేవస్థానముల అనుబంధ ఆలయమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో జ్యేష్ట మాసం పౌర్ణమిని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి కల్యాణోత్సవానికి సంబంధించి పద్దతి ప్రకారం ఒక్కో కార్యక్రమాన్ని కన్నుల పండువగ నిర్వహిచారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై సీతారాముల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి బంగారు ఆభరణాలు, వర్ణమైన పుష్పమాలతో అలంకరించారు.

ముందుగా అర్చకులు విశ్వసేన పూజ, కలశ ప్రతిష్ట, కలశపూజ, వాసుదేవ పుణ్యా వచనం, కంకణ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత పూజ, యజ్ఞోపవీత ధారణ, మధుపర్కం పట్టు వస్త్ర సమర్పణ, కన్యాదానం, మాంగల్య పూజ, మాంగల్య ధారణ, అక్షతరూపణ మాల మార్పిడి, వారణమయి మహా నివేదనం, కర్పూర హారతి కార్యక్రమాలను నిర్వహించారు. ఒంటిమిట్ట సమీప ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని చూశారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version