Site icon Bhakthi TV

బంగారు తేరులో విహరిస్తూ భక్తుల్ని కటాక్షించిన దేవదేవుడు

శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమ‌వారం సాయంత్రం 4 గంటలకు శ్రీవారు బంగారు తేరులో విహరిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్ర‌హించారు. దాసభక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల న‌డుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వ‌ర్ణర‌థోత్స‌వం అత్యంత వైభ‌వంగా జరిగింది. మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొని శ్రీ‌వారి స్వర్ణ రథాన్ని లాగారు. స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భ‌క్తుల విశ్వాసం.

అలరించిన భక్తి సంగీత కార్య‌క్ర‌మాలు..

శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమ‌వారం తిరుమ‌ల‌లోని నాద నీరాజనం, ఆస్థాన మండపంలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ధార్మిక, సంగీత కార్య‌క్ర‌మాలు భక్తులను విశేషంగా అలరించాయి. తిరుమల నాద నీరాజనం వేదికపై ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన శ్రీమతి ర‌విప్ర‌భ‌, శ్రీ వి.సుబ్ర‌హ్మ‌ణ్యం, శ్రీ నాగేశ్వ‌ర‌రావు, శ్రీ కె.వినోద్‌, శ్రీ కె.విజ‌య్ కుమార్ బృందం మంగళ ధ్వని, ఉదయం 5:30 నుండి 6:30 గంటల వరకు ఎస్ వి ఉన్నతవేద విద్యాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో వేద పారాయణం, మధ్యాహ్నం 1.30 గంటల నుండి 2.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన శ్రీ సాయికిషోరి బోస్‌ బృందం అష్ట‌ల‌క్ష్మీ వైభ‌వం నృత్య ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. ఆస్థాన మండపంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు తిరుప‌తి సాంప్ర‌దాయ పాఠ‌శాల‌కు చెందిన శ్రీమతి ల‌క్ష్మీ బృందం విష్ణు సహస్రనామ పారాయణం, ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు తిరుప‌తికి చెందిన అర్చ‌న కుల‌క‌ర్ణి బృందం భక్తి సంగీతం, ఉదయం 11:30 నుండి 12.30 గంటల వరకు భ‌ద్రాచ‌లానికి చెందిన శ్రీ స్థ‌ల‌శాయి భక్తి సందేశం ఇచ్చారు.

Share this post with your friends
Exit mobile version