Site icon Bhakthi TV

వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు ఉదయం, సాయంత్రం వివిధ వాహన సేవల నడుమ స్వామివారు భక్తులను అనుగ్రహించారు. చివరి రోజైన ఆదివారం ఉదయం చక్రస్నానం కన్నుల పండువగా జరిగింది. భక్త జన సందోహం నడుమ ఉదయం నుంచి అత్యంత వైభవంగా వివిధ కార్యక్రమాలను ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 08.00- 9.00 గం.ల మధ్య పల్లకీ ఉత్సవం చేపట్టారు.

తదుపరి 9.15 – 10.30 గం.ల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉదయం 10.30 – 10.45 గం.ల వరకు తీర్థవారి చక్రస్నానం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు న‌వ‌సంధి, మాడ‌వీధి ఉత్స‌వం నిర్వ‌హిస్తారు. రాత్రి 7 నుండి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణం జరుగనుంది. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version