Site icon Bhakthi TV

ఆ అమ్మవారికి మోదీ బహూకరించిన కిరీటం మాయం

దేశ వ్యాప్తంగా దేవీ నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దుర్గా పూజ సందర్భంగా మన దేశమే కాదు.. బంగ్లాదేశ్ ప్రభుత్వం నాలుగు రోజుల పాటు సెలవులను ప్రకటించింది. ఈ పండుగను దేశం మొత్తం వైభవంగా జరుపుకుంటోంది. అలాంటి బంగ్లాదేశ్‌లోని సత్‌ఖిరా నగరంలోని శ్యామ్‌నగర్‌లో ఉన్న ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయం ఉంది. ఈ ఆలయంలోని అమ్మవారి బంగారు కిరీటం చోరీకి గురైంది. ఈ కిరీటాన్ని ఓ యువకుడు దొంగిలిస్తున్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డైంది. ప్రధాని మోదీ 2021లో బంగ్లా పర్యటనలో భాగంగా ఈ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు.

ఆ సమయంలో అమ్మవారికి మోదీ బంగారు కిరీటాన్ని బహుమతిగా ఇచ్చారు. ఆ కిరీటం ప్రస్తుతం చోరీకి గురవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన నిన్న మధ్యాహ్నం 2:47 నుంచి 2:50 గంటల మధ్య జరిగింది. ఉదయం ఆలయ పూజారి దిలీప్ కుమార్ బెనర్జీ రోజువారీ పూజను పూర్తి చేసుకుని ఆలయానికి తాళాలు వేసి ఆలయ తాళాలు దాని నిర్వహణ బాధ్యత రేఖ సర్కార్‌కు అప్పగించారు. కాసేపటికి రేఖ సర్కార్ తిరిగి వచ్చి చూసేసరికి కాళీ మాత బంగారు కిరీటం లేకపోవడానికి గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 51 శక్తిపీఠాలలో జెశోరేశ్వరీ ఆలయం ఒకటిగా పేర్కొంటారు.

Share this post with your friends
Exit mobile version