Site icon Bhakthi TV

వినాయక చవితి నాడు ఆ యువకుడే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్..

వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఓ యువకుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ప్రతి ఒక్కరూ అతడిని ఆసక్తిగా తిలకించారు. ప్రతి ఒక్కరూ ఆ యువకుడికి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ అభినందించారు. ఇంతకీ ఆ యువకుడి ప్రత్యేకతేంటి? ఎందుకు అందరూ అతడిని అభినందించారో తెలుసుకుందాం. అక్కయ్యపాలెం గ్రామంలోని చిన్నూరుకు చెందిన మహ్మద్ ఇషాక్ అనే ముస్లిం యువకుడు నిన్న ఉదయం నమాజ్ చేసుకున్న అనంతరం ఏకంగా ఓ టెంపోతో వినాయక విగ్రహాలను పట్టుకుని అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్ సెంటర్‌కు వచ్చాడు. అటుగా వచ్చిన హిందూ సోదరులందరికీ పిలిచి మరీ వినాయక ప్రతిమలను పంపిణీ చేశాడు.

ప్రతి ఒక్కరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఏకంగా వెయ్యి మట్టి విగ్రహాలను పంచాడు. పైగా.. మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అంటూ పిలుపునిచ్చాడు. ఇక ప్రతి ఒక్కరూ ఇషాక్ దగ్గర ఒక నిమిషం ఆగి వినాయకుడి విగ్రహాన్ని అందుకుని అభినందించి మరీ వెళ్లారు. అంతేకాకుండా ఇషాక్‌తో చాలా మంది సెల్ఫీ కూడా తీసుకున్నారు. ముస్లిం యువకుడు మట్టి విగ్రహాలను పంపించాడన్న వార్త క్షణాల్లో స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. మత సామరస్యానికి ఇషాక్ ప్రతీకగా మారాడు. మొత్తానికి ఇషాక్ వినాయక చవితి రోజు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారాడు.

Share this post with your friends
Exit mobile version