Site icon Bhakthi TV

మహాకాళేశ్వరాలయంలో వింత ఘటన.. అసలేం జరిగిందంటే..

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆలయాలు చాలా ఉన్నాయి. వాటిలో మహాకాళేశ్వర ఆలయం ఒకటి. తాజాగా ఈ ఆలయానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక ఆసక్తికర ఘటన ఉంది. అది ఈ నెల 18న (సోమవారం) రాత్రి 8 గంటలకు జరిగింది. ఆలయంలో పూజారులు బాబా మహాకాళుడి శివలింగాన్ని గంజాయితో అలంకరిస్తున్నారు. అప్పుడు మహాకాళుడి శివలింగం నుంచి అకస్మాత్తుగా అలంకారం విరిగి పడిపోయింది. పూజారులు వెంటనే దానితోనే శివయ్యని మళ్ళీ అలంకరించి హారతి ఇచ్చారు.

ఈ వీడియో బాగా వైరల్ అవడంతో దీనిని జ్యోతిష్కులు.. దీనిని అసహజ సంఘటనకు సంకేతమంటుంటే.. ఆధ్యాత్మిక వేత్తలు మాత్రం గంజాయిని మహాకాళుడే వదిలేశాడని చెబుతున్నారు. మొత్తానికి ఈ సంఘటన వెనుక రెండు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి దేవతలు తమకు నచ్చిన ఏ పదార్థాన్నైనా స్వీకరిస్తారని.. పొరపాటు జరిగినా లేదంటే భక్తితో చేయకున్నా అప్పుడు మాత్రమే అంగీకరించరని చెబుతున్నారు. దీనికి కొందరు జ్యోతిష్కులు మాత్రం.. రాళ్లకు సొంతంగా తేమ గుణం ఉంటుందని.. అలాగే అంతర్గత వేడి గుణాన్ని సైతం కలిగి ఉంటాయి. వేడితో కూడిన గంజాయిని రాయిపై పూసినప్పుడు.. అది పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.

Share this post with your friends
Exit mobile version