Site icon Bhakthi TV

కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మకు శ్రీవారి సారె

చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. తిరుపతిలో గంగమ్మ జాతర ఎంత ప్రఖ్యాతి గాంచిందో తెలిసిందే. ఆ తరువాత కుప్పం ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర కూడా అంతే ప్రఖ్యాతి గాంచింది. ఈ సందర్భంగా బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శ్రీవారి సారెను అందజేశారు. కుప్పం జాతర సందర్భంగా అమ్మవారికి టీటీడీ తరుపున సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులతో కలిసి చైర్మన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి మంచి జరగాలని ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ప్రార్థించారు. ఏడాదికోసారి మాత్రమే కల్పించే అమ్మవారి విశ్వరూప దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతా రామ్ పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version