
శ్రీనివాసుడి దివ్యానుగ్రహ హోమంలో పాల్గొనాలని ఎవరికి ఉండదు చెప్పండి. అయితే దానికి మార్గమే తెలియదు. వారి కోసమే ఈ వార్త. తిరుపతి అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి రోజు శ్రీ మలయప్ప స్వామివారి దివ్యానుగ్రహ హోమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇక మీదట ఈ టికెట్లను పొందాలనుకునేవారు ఆలయానికి వెళ్తే కుదరదు. ఆన్‌లైన్‌లో సంప్రదించాల్సిదే. టీటీడీ రూల్స్ మార్చేసింది. ఇకమీదట టీటీడీ నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహం టికెట్లను ఆగస్టు 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో మాత్రమే జారీ చేస్తారు.
ప్రతి రోజు భక్తులకు కరెంటు బుకింగ్ ద్వారా 50 టికెట్లు, ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. భక్తుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు 1వ తేదీ నుండి మొత్తం 200 టికెట్లు ఆన్‌లైన్‌లో మాత్రమే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.
భక్తుల కోరిక మేరకు శ్రీవారి పాదాల వద్ద తమ శుభకార్యాలు, విశేషమైన రోజుల్లో స్వామివారి అనుగ్రహం కోసం సంకల్పం చెప్పుకుని యజ్ఞం నిర్వహించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. శ్రీవారి విశేష హోమంలో రూ.1600/- చెల్లించి గృహస్తులు (ఇద్దరు) పాల్గొనవచ్చు. హోమంలో పాల్గొన్న గృహస్తులకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారు.
