Site icon Bhakthi TV

మూడు రోజుల పాటు శ్రీ‌వాణి ఆఫ్‌లైన్ టికెట్ల‌ జారీ ర‌ద్దు

తిరుమ‌ల‌లో నెల‌కొన్న అనూహ్య ర‌ద్దీ కార‌ణంగా డిసెంబ‌ర్ 27, 28, 29వ‌ తేదిల‌కు (శ‌ని, ఆది, సోమ‌వారం) సంబంధించి శ్రీ‌వాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం ర‌ద్దు చేసింది. ఈ నేప‌థ్యంలో తిరుమ‌ల శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల కౌంట‌ర్ లో, తిరుప‌తిలోని రేణిగుంట విమానాశ్ర‌యంలో శ్రీ‌వాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్లు జారీ చేయ‌బ‌డ‌వు. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని ద‌ర్శ‌న ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించికోవాల‌ని ఈ సంద‌ర్భంగా భ‌క్తుల‌కు టీటీడీ విజ్ఞ‌ప్తి చేయ‌డ‌మైన‌ది.

పోటెత్తిన భక్తులు..

ఈ రోజు వారాంతపు సెలవుల నేపథ్యంలో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద అధిక సంఖ్యలో భక్తులు క్యూలైన్లలోకి రావడం జరిగింది. మొదట ఎస్‌ఎస్‌డీ టోకెన్స్ జారీ పూర్తి కావడంతో భక్తులు ఒక్కసారిగా దివ్య దర్శన టోకెన్లకు ఎగబడ్డారు. ఈ క్రమంలో విధుల్లో ఉన్న పోలీస్, టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై క్యూ లైన్ లలో పరిస్థితిని అదుపు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం జరిగింది.

Share this post with your friends
Exit mobile version