Site icon Bhakthi TV

భక్తులతో కళకళలాడుతున్న శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయం

నంద్యాల జిల్లా శ్రీశైలానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. కార్తీక మాసం శివకేశవులకు ప్రీతిపాత్రమైనది కావడంతో మల్లికార్జనుడు కొలువైన శ్రీశైలంలో ఈ మాసంలో భక్తుల సందడి నెలకొంది. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది. భక్తులు తెల్లవారుజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఆపై కార్తీక దీపాలను వెలిగించి అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. శ్రీశైలానికి వచ్చిన భక్తులంతా ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద, ఉత్తర శివమాడ వీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు.

ఆలయానికి కార్తీక మాసంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో శని, ఆదివారాలతో పాటు సోమవారాల్లో సైతం స్వామివారి స్పర్శ దర్శనం, సామూహిక, గర్భాలయా అభిషేకాలను నిలుపుదల చేశారు. వీక్ డేస్‌లో అంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకూ మాత్రమే రోజుకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతించనున్నారు. మొత్తానికి శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో శ్రీ బ్రమరాంబికా మల్లికార్జున స్వామివారి ఆలయంలో భక్తులతో కళకళలాడుతోంది.

Share this post with your friends
Exit mobile version