
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం ఆలయానికి భారీ ఎత్తున హుండీ ఆదాయం లభించింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలోనే మల్లన్నకు కానుకల రూపంలో కోట్ల రూపాయలను భక్తులు హుండీలో సమర్పించారు. మల్లన్న హుండీ లెక్కింపును ఆలయ అధికారులు బుధవారం చేపట్టారు. 16 రోజుల్లో స్వామివారికి రూ.5.89 కోట్లు నమోదయిందని ఆలయ ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. అలాగే బంగారం, వెండిని, విదేశాల కరెన్సీ కూడా కానుకల రూపంలో స్వామివారికి భక్తులు సమర్పించారు.
బుధవారం లెక్కించిన ఉండి లెక్కింపులో 5,89,55,455 నగదు లభించింది. అలాగే 87 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 5 కేజీల 850 గ్రాముల వెండిని భక్తులు కానుకల రూపంలో సమర్పించినట్లు ఆలయ ఈవో తెలిపారు. దీంతోపాటు యుఎస్ఏ డాలర్లు – 885, యూఏఈ దిర్హమ్స్-105, యూకే ఫౌండ్స్ 80, సింగపూర్ డాలర్లు -2, కెనడా డాలర్లు 5 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. ఈ లెక్కింపు కార్యక్రమాన్ని పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో చేపట్టినట్టు ఆలయ ఈవో వెల్లడించారు.
