Site icon Bhakthi TV

కన్నుల పండువగా శ్రీనివాసగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణం

శ్రీనివాసగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గుట్ట శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణం శ్రీనివాస కాలనీ శ్రీనివాసగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గుట్టపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం మంగళ వాయిద్యాలతో మామిడి తోర్నపాకు సాక్షిగా ఆలయ ప్రధాన అర్చకులు తోలేటి నగేష్ శర్మ, అర్చకులు, వేదపండితులు వేదమంత్రాలతో పూజల నిర్వహించారు. ఈ క్రమంలోనే సాంప్రదాయ బద్దంగా స్వామివారి కళ్యాణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి కల్యాణాన్ని కన్నులారా వీక్షించారు. శ్రీనివాసగిరి మొత్తం గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణతో గిరి మారుమోగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్త సమాజ మండలి సభ్యులు అన్ని వసతులు ఏర్పాటు చేశారు. వచ్చిన వారందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి ప్రభుత్వ లాంఛనాలతో పాల్వంచ పట్టణ ఎమ్మార్వో వివేక్ పట్టు వస్త్రాలు అధికారికంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్త సమాజం మండలి అధ్యక్ష కార్యదర్శులు ఆరుట్ల లక్ష్మణ్ ,ధర్మపురి రాము, సమన్వయకర్త ఊకె భద్రయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరు రాము తదితరులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version