Site icon Bhakthi TV

టీటీడీ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో తొలిసారి శ్రీనివాస కళ్యాణోత్సవం

అమరావతి లోని వేంకట పాలెంలో మార్చి 15వ తేదీన శ్రీనివాస కల్యాణం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ శ్రీనివాస కళ్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని, స్వామి వారి కళ్యాణాన్ని అందరూ చూసి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అమరావతిలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో తొలిసారి శ్రీనివాస కళ్యాణోత్సవం జరుగుతోందని, భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామని తెలిపారు.

భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురవకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎండాకాలం కావడంతో చలువ పందిళ్లు, ఎక్కడికక్కడ మంచినీటి సౌకర్యంతో పాటు ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో కడప ఆర్డీవో శ్రీ జాన్ ఇర్విన్, డిఎస్పీ శ్రీ వేంకటేశ్వర్లు, టీటీడీ డిప్యూటీ ఈవో లు శ్రీ నటేష్ బాబు, శ్రీమతి ప్రశాంతి, గోవింద రాజన్, శ్రీ సెల్వం, ఎస్ ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ మనోహర్, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ డా. సునీల్ కుమార్, వీజీవో శ్రీమతి సదాలక్ష్మి, అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీ వి. ఆదినారాయణ రెడ్డి, సేల్స్ వింగ్ ప్రత్యేక అధికారి శ్రీ రామరాజు, ఏవీఎస్వో శ్రీ వై సతీష్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version