Site icon Bhakthi TV

హనుమంత వాహనంపై విహరించిన శ్రీ సుందరరాజస్వామి వారు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు రెండవ రోజు వైభవంగా సాగాయి. ఉదయం 10 -11గంటల మధ్య స్వామి వారికి కళ్యాణోత్సవం చేపట్టారు. మధ్యాహ్నం 3 – 4 గంటల మధ్య శ్రీ కృష్ణ‌స్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి వైభవంగా అభిషేకం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, పసుపు, చందనాల‌తో వేడుకగా అభిషేకం నిర్వ‌హించారు. సాయంత్రం 5.45 – 6.15 గంటల మధ్య ఊంజల్ సేవ చేపట్టనున్నారు. రాత్రికి 7 – 8.30 గంటల మధ్య హనుమంత వాహనంపై నాలుగు మాడ వీధుల్లో స్వామివారు విహరిస్తారు.

జూన్ 19న ముగింపు ఉత్సవాలు

జూన్ 19న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు ముగియనున్నాయి. రాత్రి 7 – 8.30 గంటల మధ్య గరుడ వాహనంపై స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీ హరింధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ కె.చలపతి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version