Site icon Bhakthi TV

హనుమంత వాహనంపై శ్రీ సౌమ్యనాథస్వామి కటాక్షం

అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నిన్న ఉదయం పల్లకి ఉత్సవం చేపట్టారు. ఉదయం 11 గంటలకు స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి డోలోత్సవము చేప్టటారు. రాత్రి 07. 00 గంటలకు హనుమంత వాహనంపై శ్రీ సౌమ్యనాథ స్వామి భక్తులను అనుగ్రహించారు. ఇవాళ ఉదయం శేష వాహనం, రాత్రి గరుడ వాహనంపై స్వామివారు భక్తులను ఆశీర్వదించారు.

చిన్న శేష వాహనంపై శ్రీ సిద్దేశ్వర స్వామి

తాళ్లపాక శ్రీ సిద్దేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిన్న ఉదయం పల్లకీ సేవ, సాయంత్రం 06 – 07 గం.ల మధ్య చిన్నశేష వాహనంపై శ్రీ సిద్ధేశ్వర స్వామి విహరించారు. ఇవాళ ఉదయం పల్లకీ సేవ, సాయంత్రం సింహ వాహనంపై స్వామి వారు భక్తులను కటాక్షిస్తారు.

సింహ వాహనంపై శ్రీ చెన్నకేశవ స్వామి

తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిన్న ఉదయం పల్లకీ ఉత్సవం నిర్వహించారు. రాత్రి 07.00 గం.లకు సింహ వాహనంపై స్వామి వారు విహరించి భక్తులను ఆశీర్వదించారు. ఇవాళ ఉదయం పల్లకీ సేవ చేపడుతారు. రాత్రికి హనుంత వాహనంపై శ్రీ చెన్నకేశవ స్వామి విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.

Share this post with your friends
Exit mobile version