Site icon Bhakthi TV

వాహన సేవల్లో తరిస్తున్న శ్రీ సౌమ్యనాథస్వామి, శ్రీ సిద్ధికేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవస్వామి

అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నిన్న ఉదయం పల్లకి ఉత్సవం చేపట్టారు. ఉదయం 11 గం.లకు స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి డోలోత్సవము చేప్టటారు. రాత్రి 07. 00 గంటలకు సింహ వాహనంపై శ్రీ సౌమ్యనాథ స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు. ఇవాళ ఉదయం పల్లకి ఉత్సవం, రాత్రి హనుమంత వాహనంపై స్వామివారు భక్తులను ఆశీర్వదించారు.

చంద్రప్రభ వాహనంపై శ్రీ సిద్దేశ్వర స్వామి :

తాళ్లపాక శ్రీ సిద్దేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిన్న ఉదయం పల్లకీ సేవ, సాయంత్రం 06 – 07 గంటల మధ్య చంద్రప్రభ వాహనంపై శ్రీ సిద్ధేశ్వర స్వామి విహరించారు. ఇవాళ ఉదయం పల్లకీ సేవ, సాయంత్రం చిన్న శేష వాహనంపై స్వామివారు విహరించారు.

హంస వాహనంపై శ్రీ చెన్నకేశవ స్వామి

తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిన్న ఉదయం పల్లకీ ఉత్సవం నిర్వహించారు. రాత్రి 07.00 గం.లకు హంస వాహనంపై స్వామి వారు విహరించి భక్తులను ఆశీర్వదించారు. ఇవాళ ఉదయం స్వామివారికి పల్లకీ సేవ నిర్వహించారు. రాత్రికి సింహ వాహనంపై శ్రీ చెన్నకేశవ స్వామి విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.

Share this post with your friends
Exit mobile version