Site icon Bhakthi TV

సింహ వాహనంపై యోగ నారాయణ స్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉదయం, సాయంత్రం శ్రీ వేంకటేశ్వర స్వామివారు వాహన సేవల్లో తరిస్తూ భక్తులను కటాక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం యోగ నారాయణ స్వామి అలంకారంలో స్వామివారు సింహ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. ఈ బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వారికోసం ముందుగానే టీటీడీ సకల ఏర్పాట్లనూ నిర్వహించింది.

భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం 5 గం.లకు ఊంజల్ మండపంలోకి శ్రీవారు వేంచేపు చేస్తారు. అనంతరం సా. 5.30 – 6.30 గం.ల వరకు ఊంజల్ సేవ జరుగనుంది. రాత్రి 7 గం.లకు ముత్యపు పందిరి వాహనంపై స్వామి వారు భక్తులను ఆశీర్వదించనున్నారు. వాహన సేవలో డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version