Site icon Bhakthi TV

టీటీడీ సీవీఎస్వోగా శ్రీ కే.వీ.మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య నిఘా, భద్రతాధికారిగా శ్రీ కే.వీ.మురళీకృష్ణ గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సీవీఎస్వో రంగనాయకులు మండపంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆల‌య అధికారులు సీవీఎస్వోకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు సీవీఎస్వో శ్రీ వెంకట శివకుమార్ రెడ్డి, వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version