Site icon Bhakthi TV

అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించిన శ్రీ గోవిందరాజస్వామి..

తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం పెద్ద ఎత్తున రథోత్సవం నిర్వహించారు. ఈ రథోత్సవం ఉదయం 7 గంట‌లకు ప్రారంభమైంది. పెద్ద ఎత్తున భక్తులు రథోత్సవంలో పాల్గొని.. రథాన్ని లాగారు. అశ్వవాహనంపై స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా టెంకాయలు కొట్టి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఇక సోమవారం రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తులను కటాక్షించారు.

వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనంపై కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధించారు.

Share this post with your friends
Exit mobile version