Site icon Bhakthi TV

గరుడ వాహనంపై విహరించిన శ్రీ చెన్నకేశవ స్వామి..

అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో, తాళ్ళపాక సిద్దేశ్వర స్వామివారి ఆలయంలో, తాళ్ళపాక శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో బాగంగా శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో జూలై 10వ తేదీ గురువారం ఉదయం 08.00 గం.లకు సూర్య ప్రభ వాహనంపై, రాత్రి 07.00 గం.లకు చంద్ర ప్రభ వాహనంపై శ్రీ సౌమ్యనాథ స్వామి వారు విహరించి భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం 05.00 గం.లకు స్వామివారికి డోలోత్సవము నిర్వహించారు.

నంది వాహనంపై శ్రీ సిద్ధేశ్వరస్వామివారు

తాళ్ళపాక సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం 08.00 గం.లకు పల్లకీ సేవ, సాయంత్రం 06.00 – 07.00 గం.లకు నంది వాహనంపై స్వామి వారు ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.

గరుడ వాహనంపై శ్రీ చెన్నకేశవస్వామివారు.

తాళ్ళపాక శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో జూలై 10న ఉదయం 09.00 గం.లకు మోహినీ అవతారం, రాత్రి 07.00 గం.లకు గరుడ వాహనంపై శ్రీ చెన్నకేశవ స్వామి వారు విహరించి భక్తులను అనుగ్రహించారు.

Share this post with your friends
Exit mobile version