Site icon Bhakthi TV

23 నుంచి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ‌ భాష్య‌కార్ల ఉత్స‌వం

తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ భాష్య‌కార్ల( శ్రీ రామానుజాచార్యులు) ఉత్స‌వం ఏప్రిల్‌ 23 నుంచి అత్యంత వైభవంగా భాష్యకార్ల ఉత్సవం జరుగనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. మే 2వ తేదీ వ‌ర‌కూ భాష్యకార్ల ఉత్సవం జ‌రుగ‌నుంది. దీనిలో భాగంగా వివిధ కార్యక్రమాలను ఉదయం, సాయంత్రం నిర్వహించనున్నారు. పెద్ద ఎత్తున భాష్యకార్ల వారిని ఊరేగించనున్నారు.

ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 7.30 గంట‌ల‌కు భాష్యకార్ల వారిని బంగారు తిరుచ్చిపై ఆలయ చిన్నమాడ వీధి ఉత్సవం, సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు పెద్దమాడ వీధి ఉత్సవం నిర్వ‌హిస్తారు. ఉద‌యం ఊరేగింపు అనంతరం ఆలయంలో తిరుమంజనం, సాత్తుమొర, ఆస్థానం జ‌రుగ‌నుంది. మే 1న భోగి తేరు, మే 2న సాత్తుమొర జ‌రుగ‌నుంది. ఆల‌యంలో మే 3న గంధ‌పొడి ఉత్స‌వం ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు.

Share this post with your friends
Exit mobile version