
ఇప్పటి వరకూ తిరుమల అనుబంధ ఆలయాలన్నింటికీ సంబంధించి మే నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు వచ్చేశాయి. తిరుమలలో అయితే మే 1 నుంచే ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మే 6 నుంచి శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
– మే 1న అనంతాళ్వార్ ఉత్సవారంభం.
– మే 2న భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి.
– మే 6న శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ప్రారంభం.
– మే 8న పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు సమాప్తి.
– మే 10న అనంతాళ్వార్ శాత్తుమొర.
– మే 11న నృసింహ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి.
– మే 12న కూర్మ జయంతి, అన్నమాచార్య జయంతి, పౌర్ణమి గరుడ సేవ.
– మే 14న పరాశర భట్టర్ వర్ష తిరు నక్షత్రం.
– మే 22న హనుమజ్జయంతి.
– మే 31న నమ్మాళ్వార్ ఉత్సవారంభం.
