
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ప్రతి నెలా మాదిరిగానే మార్చి నెలలోనూ విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. మార్చి 8వ తేదీ నుంచి ఈ ఆలయంలో విశేష ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
– మార్చి 8, 15, 22, 29వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆలయంలో ఊంజల్‌సేవ జరుగనుంది.
– మార్చి 9వ తేదీ పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు.
– మార్చి 14వ తేదీ పౌర్ణమి నాడు ఆలయంలో ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల ఊరేగి దర్శనం ఇవ్వనున్నారు.
– మార్చి 25వ తేదీన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
– మార్చి 26వ తేదీన శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
– మార్చి 27 నుండి ఏప్రిల్ 4వ తేదీ శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు.
