Site icon Bhakthi TV

ఏప్రిల్‌ నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 3న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామి వారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. ఏప్రిల్ 4, 18వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

ఏప్రిల్ 6న శ్రీ రామనవమి సందర్భంగా సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీపట్టాభిరామస్వామి వారు మాడ వీధుల్లో భక్తులకు అభయమిస్తారు. ఏప్రిల్ 12న పౌర్ణ‌మి మ‌రియు ఉత్త‌ర న‌క్ష‌త్రం సంద‌ర్భంగా సాయంత్రం గ‌రుడ వాహ‌నంపై శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు విహ‌రించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించ‌నున్నారు. ఏప్రిల్ 22వ తేదీ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీభూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భక్తులను అనుగ్రహిస్తారు. ఏప్రిల్ 23 నుండి మే 2వ తేదీ వ‌ర‌కు భాష్య‌కార్ల ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు.

Share this post with your friends
Exit mobile version