Site icon Bhakthi TV

శ్రీశైలంలో స్వామి, అమ్మవార్లకు వేరువేరుగా నివేదనలు..

శ్రీశైల మహాక్షేత్రాన్ని ఇల కైలాసంగా భావిస్తూ ఉంటారు. అందుకే నిత్యం ఈ ఆలయానికి భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. శ్రీశైలం వెళ్లే భక్తులందరికీ మొదటి ప్రాధాన్యత భ్రమరాంబికా మల్లికార్జున స్వా మి దర్శనమైతే.. రెండవ ప్రాధాన్యత మహా ప్రసాదం. స్వామివారి ఆలయంలో ఉదయం పూట మహా ప్రసాదంగా పెద్ద లడ్డూలను విక్రయిస్తూ ఉంటారు. ఇవి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. వీటిని ఆలయానికి ఆగ్నేయ భాగంలో ఉండే లడ్డు పోటులో తయారు చేస్తారు.

ఇక శ్రీశైలం ఆలయంలో లడ్డూలతో పాటు వడ, పులిహార, దద్దోజనం కూడా ప్రసాదాల జాబితాలో ఉంటాయి. భక్తులు మాత్రం ఎక్కువగా లడ్డూలను తీసుకునేందుకే ఇష్టపడతారు. ఈ క్రమంలోనే నిత్యం 100 గ్రాముల బరువున్న చిన్న లడ్లు రోజుకు గరిష్టంగా 60 వేల దాకా అమ్ముడవుతాయి. ఇక నిత్యం స్వామివారికి, అమ్మవార్లకు వేరువేరుగా నివేదనలు ఉంటాయి. నిత్యం 25 కిలోల చొప్పున వేరువేరుగా పులిహార నివేదించి.. ఆపై దానిని భక్తులకు పస్రాదంగా పంచిపెడతారు. ఆలయ ప్రాంగణంలో వేరువేరు వంటశాలలు ప్రసాదాల తయారీకి ఉంటాయి. స్వామివారికి, అమ్మవారికి ప్రసాదాన్ని తయారు చేసేవారు కూడా వేరుగానే ఉంటారు. స్వామివారికి వీరశైవ జంగమలు, అమ్మవారికి బ్రాహ్మణులు ప్రసాదాల్ని విడివిడిగా తయారుచేస్తారు.

Share this post with your friends
Exit mobile version