Site icon Bhakthi TV

నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, క‌ర‌ప‌త్రాల‌ను తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీ వి.వీర‌బ్ర‌హ్మం ఆవిష్కరించారు. టీటీడీ పరిపాలనా భవనంలో గల జేఈవో కార్యాలయంలో సోమ‌వారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ మే 11 నుంచి 19వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయని తెలిపారు. మే 6న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, మే 10న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వ‌హిస్తారని చెప్పారు.

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 18వ తేదీ రాత్రి 8.30 నుండి 10 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రూ.1000/- చెల్లించి గృహస్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక వడ, కుంకుమ బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

11-05-2025 ధ్వజారోహణం, పెద్దశేష వాహనం.

12-05-2025 చిన్నశేష వాహనం, హంస వాహనం.

13-05-2025 సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం.

14-05-2025 కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం.

15-05-2025 మోహినీ అవతారం, గరుడ వాహనం.

16-05-2025 హనుమంత వాహనం, గజ వాహనం.

17-05-2025 సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం.

18-05-2025 రథోత్సవం కల్యాణోత్సవం, అశ్వవాహనం.

19-05-2025 చక్రస్నానం, ధ్వజావరోహణం.

Share this post with your friends
Exit mobile version