Site icon Bhakthi TV

శ్రీ లక్ష్మీ బాలాజీ సేవాసమితి ఆధ్వర్యంలో భద్రాద్రి రామయ్యకు తలంబ్రాల సమర్పణ

శ్రీరామనవమి సమీపిస్తోంది. భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణానికి సకల ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామయ్యకు భక్తులు చాలా మంది గోటితో వలిచిన తలంబ్రాలను సమర్పిస్తున్నారు. చీరాల వాసులు ఈసారి గోటి తలంబ్రాలను సమర్పించ నుండగా.. ఇతర ప్రాంత వాసులు సైతం స్వామివారి కోసం గోటితో వలిచి తలంబ్రాలను తయారు చేసి భద్రాద్రి రామయ్య దేవస్థానం అధికారులకు అందజేస్తున్నారు. ఖమ్మంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ సేవాసమితి సభ్యులు స్వామివారికి గొటి తలంబ్రాలను బుధవారం తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై, భక్తి భావంతో స్వామివారిని దర్శించుకున్నారు.

గోటి తలంబ్రాలను అందజేసేందుకు విచ్చేసిన భక్తులకు ముందుగానే దేవస్థానం అధికారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. భక్తుల పూజా సామగ్రి, తలంబ్రాల సమర్పణ, దర్శన ఏర్పాట్లు సజావుగా జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే శ్రీ రాముల వారి కల్యాణానికి ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. వేసవి కాలం కావడంతో భక్తుల కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ పరిసరాలన్నీ శుభ్రం చేస్తున్నారు. భక్తులకు మెరుగైన సేవలందించేందుకు ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని దేవస్థానం అధికారులు పేర్కొన్నారు.

Share this post with your friends
Exit mobile version