Site icon Bhakthi TV

మాఘ పూర్ణిమ నాడు ఏ నియమాన్ని పాటించినా అది గొప్ప యోగమే..

వైశాఖీ కార్తీకీ మాఘీ
తిథయో౭ తీవ పూజితాః!
స్నాన దాన విహినాస్తా
ననేయాః పాండునందన!!

స్నానదాన జపాది సత్కర్మలు లేకుండా వృథాగా ఈ మూడు మాసాలు పూర్ణిమలను గడుపరాదు. మాఘ పూర్ణిమ నాడు ‘అలభ్య యోగం’ అని కూడా అంటారు. అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది గొప్ప యోగ మవుతుంది. అది అంత తేలికగా లభించేది కాదు.

స్నానం చేస్తున్నప్పుడు పఠించాల్సిన శ్లోకం..

దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం
మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ”

అని పఠించి, మౌనంగా స్నానం చేయాలి, అంటే “దుఃఖములు, దారిద్ర్యము నశించుటకు పాపక్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ ఈ పవిత్ర మాఘ స్నానము చేస్తున్నాను అని అర్థం.

కనుక ఓ గోవిందా! అచ్యుతా! మాధవా!

ఈ స్నానమునకు యథోక్తఫలము అనుగ్రహించు” అని అర్థం.

Share this post with your friends
Exit mobile version