Site icon Bhakthi TV

ఇకపై యాదాద్రి కాదు.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి

యాదగిరి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేశారు. ఇక ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి తరహాలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి పాలక మండలిని నియమించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే దృష్టి సారించింది. ఇకపై లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని యాదాద్రి బదులుగా యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకు రావాలని సైతం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తన పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించిన రేవంత్ ఈ కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

ఇక యాదగిరి గుట్ట పాలక మండలికి టీటీడీ స్థాయిలో ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధి విషయమై కూడా సూచనలు చేశారు. అభివృద్ధి నిమిత్తం పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలని ఆదేవాలు జారీ చేశారు. ఆలయ అభివృద్ధికి వీలైనంత త్వరగా ప్రపోజల్స్ పంపించాలన్నారు. తక్షణమే అన్ని రికార్డుల్లో యాదాద్రి బదులుగా యాదగిరిగుట్టగా పేరు మార్చాలని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే యాదగిరిగుట్టపై భక్తులు నిద్ర చేసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను రేవంత్ ఆదేశించారు.

Share this post with your friends
Exit mobile version