
ప్రతి ఏటా కార్తీక మాసం వచ్చిందంటే అయ్యప్ప భక్తుల సందడి ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి వరకూ శబరిమలకు ప్రయాణాలు సాగుతూనే ఉంటాయి. అయ్యప్ప మాల ధరించిన భక్తులు 41 రోజుల పాటు నియమ నిష్టలతో అయ్యప్ప స్వామివారిని పూజించుకుంటారు. బ్రహ్మ ముహూర్తాన నిద్ర లేచి చన్నీటి స్నానాలు, ఏక భుక్తం వంటి కఠిన నిబంధనలను పాటిస్తారు. అలాగే కటిక నేల మీద పడుకుంటారు. 41 రోజుల పాటు పాదరక్షలు ధరించరు. కేవలం నల్లని దుస్తులను మాత్రమే ధరిస్తారు.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున పడిపూజకు హైదరాబాద్‌లో సన్నాహాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని కాళడి శ్రీ ఆది శంకర మఠం ప్రాంగణములో ఈ పడిపూజ జరగనుంది. ఈ నెల 15న ఆదివారం భక్తుల అందరి సహకారంతో సామూహికా అయ్యప్ప స్వామి పడి పూజ నిర్వహిస్తున్నట్లు గురుస్వాములు తెలిపారు. స్వామివారి దర్శనం చేసుకోలేని వారికి.. ఇంట్లో పూజ నిర్వహించలేని వారికి ఇది సదవకాశమని అంటున్నారు. ఎవరైనా సరే.. తమ పేరు మీద పూజను బుక్ చేసుకోవచ్చు. దీనికి రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. మీ పేరు నమోదు చేసుకోవడానికి వెబ్‌సైట్: https://kaladyshankaramadomts.orgను సంప్రదించండి. అలాగే https://kaladyshankaramadomts.org/index.php/worldline/bookings లింక్‌లో లాగిన్ అవ్వాలి. మరిన్ని వివరాల కోసం ఫోన్ నంబర్: 8350903080ను సంప్రదించండి.
