
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ నిర్వహించారు. శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీనికి ముందుగా మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా ఉదయం వివిధ పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు దంపతులు, జెఈవో శ్రీ వి. వీరబ్రహ్మం పాల్గొన్నారు.
ఇందులో భాగంగా ఉదయం భగవత్పుణ్యాహం, మూర్తి హోమం, శ్రీ మద్రామాయణ హోమం, పంచసూక్త – పవమాన హోమములు నిర్వహించారు. అనంతరం ఉదయం 9:30 గంటలకు మహా పూర్ణాహుతి, ఉదయం 10.15 నుండి 11:30 గంటల వరకు వృషభ లగ్నంలో మహా సంప్రోక్షణ మరియు మహా కుంభాభిషేకము, స్వర్ణ పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సీపీఆర్వో డా. టి.రవి, డిప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు, శ్రీ గోవింద రాజన్, శ్రీ సెల్వం, శ్రీమతి ప్రశాంతి, ఎస్ ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ మనోహర్, వీజీవో శ్రీమతి సదాలక్ష్మి, ప్రెస్ అండ్ సేల్స్ వింగ్ ప్రత్యేక అధికారి శ్రీ రామరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.
