Site icon Bhakthi TV

సీతా లక్ష్మణ సమేతడై తెప్పపై విహరించిన శ్రీ కోదండరామస్వామి

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడు రోజుల పాటు ఈ తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. మొదటి రోజు సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు శ్రీ కోదండ‌రామ‌ స్వామివారు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఈ తెప్పోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు.

మొదటిరోజు సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తెప్పపై పుష్కరిణిలో విహరించారు. మొత్తం ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అదేవిధంగా మంగళవారం శ్రీ పార్థసారథిస్వామివారు తెప్పలపై ఐదు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు. భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

Share this post with your friends
Exit mobile version