Site icon Bhakthi TV

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు పెద్ద మొత్తంలో విరాళాలు..

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు పెద్ద మొత్తంలో విరాళాలు అందాయి. ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1.50 కోట్లు కార్పొరేట్ సామాజిక బాధ్యత(CSR) కింద ఇటీవల విరాళంగా అందించింది. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆ సంస్థ జోనల్ హెడ్ శ్రీ కె.ధారాసింగ్ నాయక్, రీజనల్ హెడ్ శ్రీ ఈ.వెంకటేశ్వర్లు విరాళం చెక్కును అందజేశారు.

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళం

అలాగే చెన్నై కు చెందిన పొన్ ప్యూర్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆదివారం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆ సంస్థ సీఎండీ శ్రీ ఎం.పొన్నుస్వామి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఎం.పి.సూర్యప్రకాశ్ విరాళం చెక్కును అందజేశారు. ఈ విరాళాన్ని శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టులో భాగమైన శ్రీవేంకటేశ్వర అపన్న హృదయ పథకానికి వినియోగించాలని దాత అదనపు ఈవోను కోరారు.

Share this post with your friends
Exit mobile version