Site icon Bhakthi TV

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 19 నుంచి బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 28వ తేదీ వరకు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేప‌థ్యంలో శ‌నివారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘ‌నంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది.

ఈ సందర్భంగా గర్భాలయం, ధ్వజస్తంభం, ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఆల‌య అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్రతి రోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

19-02-2025
ఉద‌యం – ధ్వజారోహణం (మకర లగ్నంలో)

రాత్రి – హంస వాహనం

20-02-2025
ఉద‌యం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

21-02-2025
ఉద‌యం – భూత వాహనం

రాత్రి – సింహ వాహనం

22-02-2025
ఉద‌యం – మకర వాహనం

రాత్రి – శేష వాహనం

23-02-2025
ఉద‌యం – తిరుచ్చి ఉత్సవం

రాత్రి – అధికారనంది వాహనం

24-02-2025
ఉద‌యం – వ్యాఘ్ర వాహనం

రాత్రి – గజ వాహనం

25-02-2025
ఉద‌యం – కల్పవృక్ష వాహనం

రాత్రి – అశ్వ వాహనం

26-02-2025
ఉద‌యం – రథోత్సవం (భోగితేరు)

రాత్రి – నందివాహనం

27-02-2025
ఉద‌యం – పురుషామృగవాహనం

సాయంత్రం – కల్యాణోత్సవం,

రాత్రి – తిరుచ్చి ఉత్సవం

28-02-2025
ఉద‌యం – త్రిశూలస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం,

రాత్రి – రావణాసుర వాహనం

Share this post with your friends
Exit mobile version