Site icon Bhakthi TV

వేడుకగా జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి రథోత్సవం

హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 26వ తేదీ ధ్వజారోహణంతో శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా నిత్యం ఉదయం, సాయంత్రం వాహన సేవలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు హాజరవుతున్న భక్తుల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆలయ ఆవరణలో చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. భక్తులకు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుద్దీపాలంకరణలు చేపట్టారు.

ఇక బుధవారం ఉదయం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారు ర‌థాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. శ్రీ‌వారి రథాన్ని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. రథస్తుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని అర్చ‌కులు తెలిపారు. రాత్రి 7 గంటలకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఏఈవో శ్రీ ర‌మేష్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version