Site icon Bhakthi TV

కలిగిరికొండ ఆలయంలో జలాధివాసములు, అధివాసాంగ హోమం

చిత్తూరు జిల్లా కలిగిరికొండ శ్రీ కలిగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో జూలై 11 – 13వ తేదీ వరకు మండలాభిషేక కార్యక్రమం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం 07.15 నుండి 11.00 గం.ల వరకు పుణ్యాహవచనం, ఆచార్య వరణము, వాస్తు హోమం, అకల్మష హోమం, సభ, పౌండరీ కాగ్ని ప్రతిష్ట, శాంతి హోమము, ధృవమూర్తికి అష్టోత్తర శతకలశాభిషేకం, అలంకారం, విశేష పూజ నిర్వహించారు. సాయంత్రం 05.30 గంటల నుండి 09.00 గంటల వరకు అంకురార్పణం, ప్రధాన శాంతి హోమం, కళాపకర్షణం చేపట్టారు.

మండలాభిషేకం సందర్భంగా ఉదయం 08.00 – 12.00 గంటల వరకు పుణ్యాహం, ఉత్సవమూర్తికి చతుర్థశ కళశ స్నపనం, పంచగవ్య క్షీర, జలాధివాసములు, అధివాసాంగ హోమం చేపడుతారు. సాయంత్రం 05.30 – 08.30 గంటల వరకు సర్వదైవత్యం, హోమం, మహాశాంతి హోమం, ధాన్యాధివాసం నిర్వహిస్తారు. జూలై 13వ తేదీ ఆదివారం ఉదయం 06.00 – 07.30 గంటల వరకు అయాహం, పూర్ణాహుతి, ఉదయం 07.55 – 08.20 గంటల వరకు ఉత్సవమూర్తికి కళా వాహనం, స్నపన తిరుమంజనం, అలంకారం, ఉదయం 11.00 – 12.00 గంటల వరకు శాంతి కళ్యాణం, సాయంత్రం 05.00 – 06.30 గంటల వరకు గరుడ సేవను నిర్వహించనున్నారు.

Share this post with your friends
Exit mobile version