Site icon Bhakthi TV

శాస్త్రోక్తంగా శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్పణ

తితరిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మార్చి 6 నుండి 14వ తేదీ వరకు నిర్వ‌హించ‌నున్న బ్రహ్మోత్సవాలకు బుధ‌వారం సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ జరిగింది. అంకురార్పణం సందర్భంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు.
సాయంత్రం 6 గంటల నుండి పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ గోపినాథ్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణ‌మూర్తి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నేడు ధ్వజారోహణం

ఇవాళ ధ్వజారోహణంతో శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఉదయం, సాయంత్రం స్వామివారి వాహన సేవలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 7 నుండి 8 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. ఉదయం 8 నుండి 8.30 గంటల మధ్య మీన‌ ల‌గ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనసేవ జరుగనున్నాయి.

Share this post with your friends
Exit mobile version